Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్... ఇక ఆ ప్రాంతాలకు రైళ్లు రానున్నాయ్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ రైల్వే లైన్లు లేని ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ రైల్వే లైన్లు లేని ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది. ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసే పనిలో అధికారులున్నారు. డీపీఆర్ పూర్తి కాగానే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా చౌకగా, సుఖవంతమైన రైలు ప్రయాణం చేయడానికి, సరుకులు ఎగుమతి చేసుకోవడానికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు రైలు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రభుత్వం అవసరమైన అన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్లను ఏర్పాటు చేసి రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పదకొండు రైల్వే లైన్ ప్రాజెక్టులకు...
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పదకొండు రైల్వే లైన్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. డిపిఆర్ సిద్ధం చేసే పనిలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలుమార్గాల్లో రైళ్ల రద్దీ పెరిగడంతో పాటు రైళ్లను ఎక్కాలంటే సుదూరం రావాల్సి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్యుపెన్సీ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇతర రవాణా మార్గాలను ఎంచుకుంటుున్నారు. అందుకే ఆయారూట్లలో అవసరమైన చోట మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. రైల్వే శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1960 కిలోమీటర్ల వరకూ కొత్త ప్రాజెక్టుల డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైలు మార్గం లేని...
అసలు రైలు మార్గం లేని ప్రాంతాలకు కొత్తగా రైళ్లను వేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కొన్ని రైలు మార్గాలు దశాబ్దాలుగా సర్వే చేసి పెండింగ్ లో ఉన్నట్లు రైల్వే శాఖ విచారణలో తేలింది. ఇప్పుడు కొత్తగా పదకొండు ప్రాంతాల్లో రైలు మార్గం లేని చోట కొత్త రైల్వే లైను వేసేందుకు రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన సర్వే గతంలోనూ పూర్తయినా అనేక కారణాలతో పెండింగ్ లో పడ్డాయి. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాలకు కొత్త రైల్వే లైను రానుంది. ఇందులో భాగంగానే కొండపల్లి నుంచి మైలవరం, తిరువూరు మీదుగా సత్తుపల్లి సమీపంలోని లంకపల్లికి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అవకాశం ఉందని తెలిసింది.