ఏలూరు వైద్య కళశాలలో ర్యాగింగ్ కలకలం

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది.

Update: 2025-12-02 03:02 GMT

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్లకు, జూనియర్లకు అర్ధరాత్రి గొడవ జరిగింది. తమను సీనియర్లు ర్యాంగింగ్ పేరుతో వేదిస్తున్నారంటూ విద్యార్థులు గొడవకు దిగారు. రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేశారు. గత కొంతకాలంగా మూడో సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.

పోలీసులకు ఫిర్యాదు...
సీనియర్లు పదిహేను మంది జూనియర్లను ది వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఈ ర్యాంగింగ్ ఒకటి రెండు రోజులు కాకుండా వరసగా చేస్తుంటంతో జూనియర్ విద్యార్థులు ఆందోళనకు దిగడమే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశించారు.


Tags:    

Similar News