YSRCP : నేడు వైసీపీ కీలక సమావేశం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశం కానున్నారు.

Update: 2025-11-06 02:41 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. విద్యార్థుల సమస్యలు, ఫీజు రీఎంబర్స్ మెంట్, మెడికల్ కళాశాలలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడం వంటి వాటిపై జగన్ చర్చించనున్నారు.

దశల వారీ ఆందోళనపై...
విద్యార్థుల సమస్యలపై దశల వారీగా ఆందోళన చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు కు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంంభించి ఎనిమిదేళ్లు కావడంతో తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమానికి కీలక నేతలు హాజరు కానున్నారు.


Tags:    

Similar News