రేపు పుట్టపర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 22, 23 తేదీల్లో పుట్టపర్తిలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 22, 23 తేదీల్లో పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈనెల 22న ఉదయం 8.15 గంటలకు విజయవాడ నుంచి పుట్టపర్తికి వెళ్లనున్నారు. 22న ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతితో కలిసి సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల్లో...
22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు పుట్టపర్తి విమానావ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలకనున్నారు. 22న మధ్యాహ్నం 3.50 గంటలకు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. శ్రీసత్యసాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ స్నాతకోత్సవం – స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. రాత్రికి పుట్టపర్తిలోనే బసచేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, 23న ఉదయం 9 గంటలకు సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లికి తిరిగిరానున్నారు.