Puttaparthi : భక్తులతో కిటకిటలాడుతున్న పుట్టపర్తి
శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది.
శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు పుట్టపర్తి ముస్తాబయింది. ఇప్పటికే పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. బాబా సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నిన్న ప్రారంభమయిన వేడుకలు కొనసాగనున్నాయి. నిన్న వెండి రధోత్సవం పుట్టపర్తి పట్టణంలో కన్నుల వైభంగా సాగింది. దీంతో పాటు 9.2 కిలోల బంగారంతో బాబా ఉత్సవ విగ్రహాన్ని వెండి రథంలో ఊరేగించారు.
ఆధ్యాత్మిక వాతావరణం...
వెండి రథాన్ని 31.8 అడుగుల ఎత్తులో తయారు చేశారు. రథం తయారీకి 180 కిలోల వెండిన, పూతగా కిలో బంగారాన్ని వినియోగించినట్లు శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ తెలిపింది. అలాగే విశ్వశాంతి కోసం 1100 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించాయి. ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక గీతాలాపనలతో పర్తి సాయి భక్తులు తన్మయంలో మునిగిపోతున్నారు. లక్షలాది మంది భక్తులు పుట్టపర్తికి తరలి రావడంతో ఆధ్మాత్మిక వాతావరణం విలసిల్లుతుంది. మరొకవైపు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో పుట్టపర్తిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.