Purandhreswari : చిన్నమ్మ సీరియస్ డెసిషన్.. రాజకీయాలకు బై.. బై?
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంద్రీశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంద్రీశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. రాజకీయాల నుంచి వైదొలగాలని భావిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేశ్ చెంచురామ్ వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ మేరకు కుటుంబ సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాల మధ్య సయోధ్య నెలకొనడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనను పోటీకి దింపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. ఆయన పుస్తకాలు రాసుకుంటూ, మనవళ్లతో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. రాజకీయాల్లోకి తన కుమారుడు హితేశ్ చెంచురామ్ ను ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించినా కొన్ని అడ్డంకుల కారణంగా అది సాధ్యం కాలేదు.