Andhra Pradesh : నేడు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో

నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది.

Update: 2025-12-21 03:34 GMT

నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప‌ల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఉండ‌వ‌ల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమం ప్రారంభించనున్నారు. 54 లక్షల మందికిపైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది.

యాభై లక్షల మందికి పైగా...
రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 38,267 పోలియో కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణాలు చేసే వారి కోసం బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లలో కూడా 1,140 బూత్ లను ఏర్పాటు చేశారు. తిరుమలలోనూ ప్రత్యేకంగా భక్తుల కోసం పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News