Andhra Pradesh : రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం ప్రకటించింది

Update: 2025-10-09 07:04 GMT

రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం ప్రకటించింది. తమకు రావాల్సిన బకాయీలను చెల్లించకపోవడంతో వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు బకాయీలు చెల్లించకపోవడమే కాకుండా బీమా పథకాన్ని తీసుకు రావడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు.

బకాయీలు ఉండటంతో...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ నెల 10వ తేదీ నుంచి బంద్ కానున్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బకాయిలు చెల్లించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులకు 2,700 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, అందుకే ఈ సేవలను నిలిపివేస్తున్నామని వారు ప్రకటించారు


Tags:    

Similar News