Narendra Modi : అమరావతి ప్రధాని మోదీ రాక ఎప్పుడంటే?
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది. వచ్చే నెల 15వ తేదీన ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారయింది. వచ్చే నెల 15వ తేదీన ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. రాజధాని అమరావతి పనులను ఆయన ప్రారంభించనున్నారు. రాజధాని పనులకు మోదీ చేత ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. తొలి దశలో నలభై వేల కోట్ల రూపాయల పనులకు శ్రీకారం చుట్టనుంది.
వచ్చే నెల 15న...
ఈ పనులకు సంబంధించి టెండర్లు కూడా ఖరరాయ్యాయి. అయితే ప్రధాని పర్యటన ఏప్రిల్ 15వ తేదీన అమరావతికి వస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపింది. దీంతో ఆరోజు రాజధాని అమరావతి పనుల పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయనున్నారు. మూడేళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు.