ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు ఏర్పాట్లు

అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్‌ ఖరారయింది

Update: 2025-04-17 05:45 GMT

అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్‌ ఖరారయింది. వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని సభకు సుమారు ఐదు లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద 50 వేల మంది కూర్చునేలా, లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేందుకు, అలాగే మిగతా వారు వివిధ ప్రాంతాల్లో ఉండి వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌...
అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు అయింది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. సచివాలయం వెనక బహిరంగసభ వేదికను ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కణ్నుంచే పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది.


Tags:    

Similar News