Narendra Modi : నేడు శ్రీ సత్యసాయి జిల్లాకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించునున్నారు
prime minister narendra modi
ప్రధాని నరేంద్ర మోదీ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించునున్నారు. 541 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీని ఆయన ప్రారంభించనున్నారు. మొత్తం 503 ఎకరాల్లో దీనిని నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ శిక్షణ కేంద్రాన్ని నేడు ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
లేపాక్షి ఆలయాన్ని...
ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రాముఖ్యత కలిగిన లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. అనుమతి ఉన్న వారికే ప్రధాని పర్యటనలో పాల్గొనే అవకాశముంటుంది.