Andhra Pradesh : నేడు ఈ జిల్లాల్లో వానలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడింది

Update: 2025-12-03 04:35 GMT

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడింది. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

భారీ వర్షాలు...
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి జిల్లా మల్లంలో 53.5 మిమీ, తడలో 50.7 మిమీ, చిత్తమూరులో 50.2మిమీ, పూలతోటలో 33.5మిమీ వర్షపాతం నమోదైందని తెలిపింది. ఈరోజు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని పేర్కొంది. మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News