Puttaparthi : పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి

Puttaparthi : పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి

Update: 2025-11-22 07:06 GMT

పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. పుట్టపర్తి చేరుకున్నరాష్ట్రపతికి ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లు స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయం చేరుకున్న రాష్ట్రపతి సత్యసాయి మహా సమాధినిదర్శించుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సత్యసాయిబోధనలు...
సత్యసాయి బోధనలు మానవాళి మనుగడకు మార్గదర్శకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సాయి బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ప్రపంచమంతా శాంతి చోటు చేసుకుందని అన్నారు. సత్యసాయి శాంతి, సమానత్వం తో పాటు స్వామి బోధనలు ఎందరినో సన్మార్గంలో నడిపించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లు పాల్గొన్నారు.


Tags:    

Similar News