ప్రధాని మోదీ విశాఖ పర్యటనపై ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభమయింది
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభమయింది. జూన్ 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రానున్నారు. యోగా డే ఉత్సవాల్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నేటి నుంచి విశాఖలో అధికారుల ప్రారంభించారు. ఆర్కే బీచ్ లో అధికారులు యోగా ను నిర్వహించారు. దీంతో పాటు హోం మంత్రి వంగలపూడి అనిత జిల్లా అధికారులతో కలిసి బీచ్ రోడ్ ను సందర్శించారు.
హోంమంత్రి పరిశీలన...
వచ్చే నెల 21న ప్రధాని విశాఖ రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులకు హోం మంత్రి వంగలపూడి అనిత పలు సూచనలు చేశారు. యోగ డే కు జనం భారీగా రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని నిర్ణయించారు. ప్రధాని పర్యటనలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పని చెయ్యాలని హోం మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.