రాజకీయాల్లో ఎదగాలంటే వాటిని పక్కన పెట్టాలి : పోసాని
పవన్ కల్యాణ్ .. చంద్రబాబు ప్రజలకు వేసిన ఒక ఎర అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతోనే ఉంటే.. సీఎం కాదు కదా..
posani fires on pawan kalyan
ఏపీ వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయన్న విషయం తెలిసిందే. పవన్ వ్యాఖ్యలకు నిరసనగా.. రాష్ట్రంలో వాలంటీర్లంతా పవన్ దిష్టిబొమ్మలను దహనం చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ ఆ వ్యాఖ్యలు ఏ ఆధారంగా చేశారో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులు పంపింది. తాజాగా పోసాని కృష్ణమురళి మరోసారి పవన్ తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. ఇండస్ట్రీలో మహిళలను తిట్టినపుడు ఏం చేశావ్ ? అని మీడియా ముఖంగా ప్రశ్నించారు. కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు ఎందుకు సమాచారమిస్తాయి ? ఇదంతా చంద్రబాబు, లోకేష్ ల స్క్రిప్ట్ అని పోసాని ఆరోపించారు. పవన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే.. అది అతని ముఖంలోనే తెలుస్తుందన్నారు. అతను చేసిన ఆరోపణలు అబద్ధమని అతనికి కూడా తెలుసని పోసాని పేర్కొన్నారు.