ఏపీలో ఏకపక్షం.. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు

Update: 2022-07-18 05:29 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం తన ఓటును వేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వరసగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాక్ పోలింగ్ తర్వాత వరసగా వచ్చి తమ ఓటును వేస్తున్నారు.

వైసీపీ, టీడీపీ....
ఆంధ్రప్రదేశ్ లో ఏకపక్షంగా పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అధికార వైసీపీ మద్దతు ప్రకటించింది. 151 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదే సమయంలో విపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలపడతంతో ఏపీలో రాష్ట్రపతి ఎన్నిక ఏకపక్షమయిందనే చెప్పాలి.


Tags:    

Similar News