టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు.. వైఎస్ భారతిపై?

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు

Update: 2025-04-10 06:07 GMT

ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించడంతో కిరణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాసేపట్లో గుంటూరులో కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.

టీడీపీ అధిష్టానం ఆగ్రహం ...
కిరణ్ వ్యాఖ్యల పట్ల టీడీపీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలను మహిళలపై చేస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అసభ్య కరమైన వ్యాఖ్యలు మహిళపై చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని టీడీపీ హైకమాండ్ తేల్చి చెప్పింది. దీంతో కిరణ్ వైఎస్ భారతికి క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు.


Tags:    

Similar News