తిరుపతి పోలీస్ స్టేషన్ కు భూమన కరుణాకర్‌రెడ్డి

వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ చేశారు

Update: 2025-09-18 04:47 GMT

వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నేడు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈరోజు తిరుపతి పోలీస్ స్టేషన్ కు భూమన కరుణాకర్ రెడ్డి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

అలిపిరిలో విగ్రహంపై...
అలిపిరిలో విగ్రహంపై అనవసర వివాదం సృష్టించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి కేసునమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నేడు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని విచారించనున్నారు. ఈ వ్యాఖ్యలపై ఆయనను విచారించి వదిలేస్తారా? లేక అదుపులోకి తీసుకుంటారా? అన్నది చూడాలి.


Tags:    

Similar News