నల్లపురెడ్డికి నోటీసులు జారీ ఛాన్స్

కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నేడు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశముంది

Update: 2025-07-17 04:14 GMT

కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నేడు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశముంది. నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని దూషించారన్న ఆరోపణలతో కేసు నమోదయింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.

వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై...
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తనపై నమోదయిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిలివ్వలేమని హైకోరటు తెలిపింది. ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పడంతో ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News