నల్లపురెడ్డిపై కేసు నమోదు
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసునమోదు చేశారు.
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసునమోదు చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నేడు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశముంది. విచారణకు పిలిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ల మధ్య జరిగిన మాటల యుద్ధంలో మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వీడియోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా తన ఇంటిపై దాడి చేశారంటూ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇంకా కేసు నమోదు కావాల్సి ఉంది.