జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసు కేసు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీనటి మాధవీలత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీనటి మాధవీలత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబరు 31వ తేదీన జేసీ ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే జేసీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వెళ్లవద్దంటూ మాధవీ లత పిలుపు నిచ్చారు.
మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
అక్కడ మహిళలకు రక్షణ ఉండదని తెలిపారు. దీనిపై ఆగ్రహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మాధవీ లత తనపై అసభ్యకరమైన పదాలతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జేసీ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.