Ys Jagan : జగన్ 9న చిత్తూరు జిల్లా పర్యటనలో పోలీసుల ఆంక్షలివే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేశారు

Update: 2025-07-07 03:49 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. ఈ నెల 9వ తేదీన జగన్ చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డును సందర్శించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక వైసీపీ నేతలు జగన్ పర్యటన కోసం అనుమతికి పోలీసులు దరఖాస్తు చేసుకున్నారు.

ఐదువందలకు మించి...
వైఎస్ జగన్ హెలిప్యాడ్ కు అనుమతించిన పోలీసులు బంగారు పాళ్యం మార్కెట్ యార్డుకు కేవలం ఐదు వందల మందితో మాత్రమే జగన్ రావాలని నిబంధనవిధించారు. బంగారు పాళ్యం మార్కెట్ యార్డు చిన్నది కావడంతో ఎక్కువ మందిని అనుమతించబోమని తెలిపారు. అలాగే ర్యాలీలకు, వాహనాల కాన్వాయ్ లకు కూడా అనుమతి లేదని, హెలిప్యాడ్ వద్దకు కూడా కేవలం ముప్ఫయి మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News