షర్మిల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు

Update: 2025-05-22 02:22 GMT

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమె ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆమరణ దీక్షకు దిగిన షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ లోని...
విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రెగ్యులర్ కార్మికులు కూడా ఒకరోజు విధులను బహిష్కరించి వారికి మద్దతుగా నిలిచారు. వైఎస్ షర్మిల కూడా ఆమరణ దీక్షకు దిగడంతో తొలి రోజే దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను నేరుగా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి పంపించి వేశారు


Tags:    

Similar News