Breaking : గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు
అనంతపురంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చారు
అనంతపురంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు వచ్చారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వచ్చినట్లు తెలిసింది. ఒక కేసు విషయంలో గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు రావడంతో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. విచారణకు రావాలంటూ గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
ఒకకేసు విషయంలో...
ఇటీవల ఏపీలో వైసీపీ నేతలు వరసగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు రావడంతో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారంజరగడంతో పెద్దయెత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడకు తరలి వచ్చారు.అయితే తాము నోటీసులు ఇవ్వడానికే వచ్చామని పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.