హైదరాబాద్ లో పోసాని అరెస్ట్
సినీ రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు
సినీ రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మీద అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో...
హైదరాబాద్ లోని మై హోమ్ భుజా అపార్ట్ మెంట్ లోనిఆయన నివాసానికి వెళ్లన పోలీసులు ఆయననలు అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆయనపై బీఎన్ఎస్ లోని 196, 353(2), 111 రెడ్ విత్ 3, (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తీసుకెళ్లారు. ఆయనను నేడు రాజంపేట కోర్టులో హాజరు పర్చే అవకాశముంది. తొలుత తన ఆరోగ్యం బాగాలేదని, తనకు ముందుగా నోటీసులు ఇస్తే విచారణకు సహకరిస్తానని చెప్పారు. కానీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి పోలీసులు అనంతపురం జిల్లాకు తీసుకెళ్లారు.