బాపట్ల అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయిన విమానం

హైదరాబాద్ కు చెందిన ‘పిస్తాహౌస్’ విమానాన్ని హోటల్ గా మార్చేందుకు దీనిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ కు తరలిస్తుండగా..

Update: 2022-11-13 03:20 GMT

pista house flight

పాత విమానాన్ని కొచ్చిన్ నుండి ట్రాలీ లారీపై హైదరాబాద్ కు తరలిస్తుండగా బాపట్ల జిల్లాలోని ఓ అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. హైదరాబాద్ కు చెందిన 'పిస్తాహౌస్' విమానాన్ని హోటల్ గా మార్చేందుకు దీనిని కొనుగోలు చేసింది. హైదరాబాద్ కు తరలిస్తుండగా.. శనివారం రాత్రి.. జిల్లాలోని మేదరమెట్ల బైపాస్ లోని అండర్ పాస్ వద్ద విమానాన్ని తరలిస్తూ ట్రాలీ ఇరుక్కుపోయింది. మేదరమెట్ల వద్ద కొండరాళ్లను తొలగించే పనులు ప్రారంభం కావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు.

విమానాన్ని తరలిస్తున్న లారీ అండర్‌పాస్‌ గుండా వెళ్లే ప్రయత్నం చేయగా, మధ్యలో ఎత్తు ఎక్కువగా ఉండడంతో ఇరుక్కుపోయింది. దీంతో విమానానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా దానిని అండర్ పాస్ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానం ఇరుక్కుపోవడంతో .. అటువైపుగా వెళ్లే వాహనాలను ఫ్లై ఓవర్ మీదుగా కొరిశపాడు అండర్ పాస్ మీదుగా దారి మళ్లిస్తున్నారు.


Tags:    

Similar News