Supreme Court : పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్

పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది

Update: 2025-11-28 06:49 GMT

పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. మే 26వ తేదీన గుండ్లపాడులో జరిగిన జంట హత్య కేసులో ఊరట లభించలేదు. గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రెండు వారాల్లో సరెండర్ కావాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో పాటు అతని సోదరుడికి సుప్రీంకోర్టు సూచించింది. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల బెయిల్ రద్దు కావడంతో వారు లొంగిపోవాలని ఆదేశించింది.

జంట హత్య కేసుల్లో ...
జంట హత్య కేసుల్లో పిన్నెల్లి సోదరులు ప్రధాన నిందితులని, వారు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు పిన్నెల్లి సోదరులకు జంట హత్య కేసులో ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేసింది. దీంతో పిన్నెల్లి సోదరులు రెండు వారాల్లో లొంగిపోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News