Perni Nani : పేర్ని నాని ఆ రూట్లో వెళ్లడానికి కారణం అదేనా?

మాజీ మంత్రి పేర్ని నానికి క్రేజ్ ఉంది. మచిలీపట్నంలో ఆయనకు కాపు సామాజికవర్గం కూడా అండగా ఉండేది

Update: 2025-11-07 09:00 GMT

మాజీ మంత్రి పేర్ని నానికి క్రేజ్ ఉంది. మచిలీపట్నంలో ఆయనకు కాపు సామాజికవర్గం కూడా అండగా ఉండేది. ఎక్కువ మంది కాపులు ఆయనకు మద్దతిచ్చేవారు. కానీ 2019 ఎన్నికల తర్వాత పేర్ని నాని పై కాపుల్లో వ్యతిరేకత మొదలయింది. పేర్ని నాని ఒంటికాలిపై పవన్ కల్యాణ్ పై లేస్తుండటం, ఆయనపై విమర్శలు చేస్తుండటంతో సొంత సామాజికవర్గం నానికి దూరమయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పేర్ని నాని మంచి వాగ్దాటి ఉన్న నేత. నాడు జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉండి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడం వల్లనే కాపు సామాజికవర్గం నానికి దూరమయిందన్నది వాస్తవం. అంతకు ముందు ఆయనకు బలంగా నిలిచిన వర్గం కూడా ఆయన వైపు నిల్చోకపోవడానికి జనసేన కారణమని చెప్పాలి.

నానికి అనుకూలంగా...
ఇప్పుడు కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయినా.. కొన్ని పరిణామాలు పేర్ని నానికి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ గత పదహారు నెలల నుంచి కొంత మౌనంగా ఉండటంతో పాటు కందుకూరు ఘటనపై మాట్లాడకపోవడంతో పాటు గతంలో మచిలీపట్నంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, నామినేటెడ్ పదవుల్లో తమకు అన్యాయం జరిగిందని భావించడం, మచిలీపట్నంలో ప్రస్తుతం కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవులు కొందరికే దక్కుతుండటంతో నానికి అనుకూలంగా క్రమంగా కాపులు కూడా మారుతున్నారన్నది వాస్తవం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. అక్కడి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో...
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఫలితాలు నాని వైపు ఉంటాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికతోనూ ఫలితాలు ఉంటాయని అంటున్నారు. మచిలీపట్నం జనసేనలో మాత్రం కూటమి సర్కార్ పై కొంత అసహనం ఏర్పడింది. అందులోనూ టీడీపీపై కొంత వ్యతిరేకతతో ఉన్నారు. పవన్ కల్యాణ్ కూడా పార్టీ కోసం కష్టపడిన తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు. అయితే దీనిని పేర్ని నాని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశముంది. మంత్రి కొల్లు రవీంద్ర కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై రోడ్డు విస్తరణ పనులు కూడా నాని బయటకు తెచ్చి తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి పేర్ని నాని ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయన్నది చూడాలి.




Tags:    

Similar News