Andhra Pradesh : నేడు ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం
నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.
నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వృద్దులు, వితంతువులుకు నాలుగు వేల రూపాయలు చొప్పున, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో సిచివాలయం, రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు.
ప్రతి నెల ఒకటోతేదీ...
ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం ప్రారంభించింది. ఒకటో తేదీ సెలవు ఏదైనావస్తే ముందు రోజు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేయనున్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.