Pensions in Ap : ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటల నుంచి సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది ఈ పింఛ్లన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి నెల మొదటి తేదీన ఠంచనుగా పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రారంభించింది. ఇప్పటి వరకూ పన్నెండు నెలల నుంచి ఫస్ట్ తారీఖున పింఛన్లను పంపిణీ చేస్తుంది.
ఉదయం నుంచి...
వితంతవులకు, వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరువేల రూపాయలు, పూర్తిగా మంచానికే పరిమితమైన దివ్యాంగులకు నెలకు పదిహేను వేల రూపాయల చొప్పున పింఛన్లను పంపిణీ చేస్తుంది. దీనికి సంబంధించి దాదాపు 66 లక్షల మందికి ఈరోజు, రేపట్లో పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈనెలలో వీటి సంఖ్య మరికొంత పెరిగే అవకాశముంది. దీనికి సంబంధించిన నిధులు ఇప్పటికే సచివాలయ సిబ్బందికి చేరడంతో వారు ఇంటింటికి తిరిగి ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేస్తున్నారు.