Andhra Pradesh : ఏపీలో నేడు పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. ఉదయం ఏడున్నర గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Update: 2025-05-31 02:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. ఉదయం ఏడున్నర గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ప్రతి నెల మొదటి తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే రేపు ఆదివారం కావడంతో ఈరోజు పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అవసరమైన నిధులను...
ఈ మేరకు పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులను విడుదల చేసింది. వార్డు, సచివాలయం, రెవెన్యూ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. వృద్ధులు, వితంతువలకు నాలుగు వేలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున పింఛన్ల పంపిణీ జరుగుతుంది.


Tags:    

Similar News