రాజధాని అమరావతి చంద్రబాబుపై నమ్మకంతోనే

అమరావతికి చట్టబద్ధత తెచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

Update: 2026-04-01 07:03 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతికి చట్టబద్ధత తెచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కృష్ణా నది ఒడ్డున నిర్మించ తలపెట్టిన రాజధాని కోసం రూపాయి ఖర్చు లేకుండా 39 వేల ఎకరాలను సేకరించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. తమ నమ్మకం చంద్రబాబు అని అన్నారు. నలభై ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమయిన చంద్రబాబుకు రైతులు అండగా నిలిచారన్నారు.

జగన్ వచ్చి మూడు ముక్కలు చేసి...
వైఎస్ జగన్ వచ్చి మూడు ముక్కల రాజధానిని చేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను పణంగా పెట్టారన్నారు. 29 వేల మంది రైతులకు అన్యాయం చేశారన్నారు. గత ప్రభుత్వంలో రైతులను ఇబ్బందులు పెట్టారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 1631 రోజుల పాటు రైతులు సుదీర్ఘ ఉద్యమం కొనసాగించారని, ఆ రైతుల కన్నీళ్లే నేటి చట్టానికి పునాది అని పెమ్మసాని తెలిపారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉందన్నారు.


Tags:    

Similar News