Tiger : పోలవరం జిల్లాలోనే పెద్ద పులి
పోలవరం జిల్లా గోదావరి తీరంలోనే పెద్దపులి సంచారం కొనసాగుతుంది
పోలవరం జిల్లా గోదావరి తీరంలోనే పెద్దపులి సంచారం కొనసాగుతుంది. పి.గొందూరు వద్ద పోలవరం నావిగేషన్ కెనాల్ సమీపంలో పులి కదలికలు గుర్తించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రసిద్ధిగాంచిన గండి పోచమ్మ ఆలయం సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటాన్ని అధికారులు గమనించారు.
ఆలయానికి భక్తులు...
ఇప్పటికే ఆలయానికి భక్తుల తాకిడి తగ్గింది. మన్యం నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే రహదారిలోనూ రాకపోకలు తగ్గాయి. రంపచోడవరం సబ్ డీఎఫ్‌వో అనూష ఆధ్వర్యంలో అటవీ బృందాల పర్యవేక్షణ కొనసాగుతుంది. పులిని బంధించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.