లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్ - వైఎస్ షర్మిల
లిక్కర్ మాఫియాపై ప్రభుత్వం కేసులు బనాయిస్తుండటంతో వైసీపీ కి భయం పట్టుకుందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
లిక్కర్ మాఫియాపై ప్రభుత్వం కేసులు బనాయిస్తుండటంతో వైసీపీ కి భయం పట్టుకుందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. భయాలను అడ్రెస్ చేయడానికి, సెక్యూరిటీ కల్పించడానికి ఇప్పుడు జగన్ మాట్లాడుతున్నట్లుందన్నారు. జగన్ ఒకప్పటి ముఖ్యమంత్రి అని, ఇలాంటి వ్యక్తి పోలీసుల మీద మాట్లాడిన తీరు బాధాకరమన్నారు వైఎస్ షర్మిల. వారి బట్టలు ఊడదీస్తా డట. తరిమి తరిమి కొడతాడట. విదేశాల్లో ఉన్నా పట్టుకుంటాం అని మాట్లాడుతున్నాడంటూ వైఎస్ షర్మిల జగన్ పై ఫైర్ అయ్యారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో...
ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్ పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికి తెలుసునన్న షర్మిల రఘురామ కృష్ణం రాజుని అడిగితే చెప్తారని, కాదంబరి ని అడిగితే చెబుతందన్నారు. మీకోసం పోలీసులను వాడుకొని ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదన్న వైఎస్ షర్మిల లిక్కర్ లో అవినీతి జరిగింది అని జగన్ మీద ఆరోపణలు ఉన్నాయని, ఇలాంటి సమయంలో ఆయన వ్యవహరించే తీరు కరెక్ట్ గా లేదన్నారు. ys రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు తన మీద ఆరోపణలు వస్తె ఎంతో హుందాగా వ్యవహరించారని, కావాల్సిన విచారణ జరిపించండి అని చెప్పారని గుర్తు చేశారు.