Pawan Kalyan : దక్షిణాది రాష్ట్రాల పర్యటనపై పవన్ స్పందన ఇదే

దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని పవన్ కల్యాణ్ అన్నారు.

Update: 2025-02-13 02:06 GMT

దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని పవన్ కల్యాణ్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరిన పవన్ పై అనేక ప్రచారం జరుగుతన్న నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. కేరళలోని అగస్త్య ఆలయం సందర్శించిన పవన్ కల్యాణ్ తన తాజా పర్యటనకు రాజకీయాలతో సంబంధంలేదని స్పష్టం చేశారు.

రాజకీయాలతో సంబంధం లేదు...
తన దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. ఇది వ్యక్తిగత పర్యటన అని, నాలుగున్నరేళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తన ఆరోగ్యం సహకరించకున్నా వచ్చానని తెలిపారు. దీనిపై ఎవరూ ఏ విధంగా ప్రచారం చేసినా తాను పట్టించుకోనని ఆయన తెలిపారు.


Tags:    

Similar News