Pawan Kalyan: తల్లికి అస్వస్థత అని తెలియగానే
ఏపీ కేబినెట్ సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత
ఏపీ కేబినెట్ సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు.
ఈ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి పవన్ కూడా హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగా, హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు పవన్ కు సమాచారం అందింది. పవన్ కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు పయనమయ్యారు. పవన్ వెళ్లిపోయిన తర్వాత మిగిలిన మంత్రులతో కేబినెట్ సమావేశం యథావిధిగా కొనసాగింది.