Pawan Kalyan : పెద్దిరెడ్డి ఆక్రమణలపై పవన్ వీడియో రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించిన వీడియో విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. అటవీ భూములను ఆక్రమించుకుని గెస్ట్ హౌస్ లను కట్టుకున్న తీరును ఆయన వీడియో తీసి మరీ బయటపెట్టారు.ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్ హెలికాప్టర్ లో వెళుతూ తన సెల్ ఫోన్ లో ఈ వీడియోను చిత్రీకరించారు. అటవీ భూములను ఆక్రమించుకుని వైసీపీనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
అటవీభూములను ఆక్రమించుకుని...
అటవీ భూములను ఆక్రమించుకున్న వారిని ఎవరినైనా వదిలిపెట్టవద్దని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.అదే సమయంలో అటవీ భూములను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గతంలో కేసు నమోదు చేసినా ముందుకు కదలకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న అటవీ భూములను ఆయన ఎక్స్ వేదికగా బయటపెట్టారు. వెంటనే చట్టపరమైన చర్యలు సంబంధిత వారిపై తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.