నేడు అసెంబ్లీకి చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి పార్టీ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. అక్కడి నుంచే అసెంబ్లీకి బయలుదేరతారు

Update: 2023-03-23 03:38 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి పార్టీ ఎమ్మెల్యేలు చేరుకుంటున్నారు. అక్కడి నుంచే అసెంబ్లీకి బయలుదేరతారు. ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.

చాలా కాలం తర్వాత....
చాలా కాలం తర్వాత చంద్రబాబు అసెంబ్లీకి రానున్నారు. తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఇంత వరకూ రాలేదు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు అసెంబ్లీకి వస్తుండటంతో టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. చంద్రబాబు ఇంటి నుంచే అసెంబ్లీకి అందరూ బయలుదేరి వెళ్లనున్నారు.


Tags:    

Similar News