పాపికొండల విహార యాత్రకు బ్రేక్
గోదావరి నదిలో పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది.
గోదావరి నదిలో పాపికొండల విహార యాత్రకు బ్రేక్ పడింది. భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రమాదకరమని భావించిన టూరిజం శాఖ పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది. దేవిపట్నం నుంచి పాపికొండల విహారయాత్రను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో పడవ ప్రయాణం ప్రమాదకరమని భావించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నది ప్రవాహంతో...
దేవిపట్నంలోని రెడుు గ్రామాల మధ్య రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతుండటంతో తాత్కాలికంగా బ్రేకులు వేశారు. తిరిగి ఎప్పుడు పాపికొండల యాత్ర ప్రారంభమవుతుందన్నది అధికారులు ప్రకటించనున్నారు. గోదావరిలో నీటి మట్టం తగ్గిన తర్వాత పునరుద్ధరించే అవకాశాలున్నాయి.