YSRCP : వైసీపీ నేతలపై పల్నాడు పోలీసులు కేసు నమోదు
వైసీపీ నేతలపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు
వైసీపీ నేతలపై పల్నాడు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు గౌతమ్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, శ్రీకాంత్ పై కేసు నమోదు చేశారు. ఈనెల 23న నరసరావుపేట కలెక్టరేట్ వద్ద వైసీపీ యువత పోరు కార్యక్రమం సందర్భంగా వీరు వ్యవహరించిన తీరును తప్పుపడుతూ పోలీసులపై జులుం ప్రదర్శించారంటూ కేసులు నమోదు చేశారు.
పోలీసులపైకి దూసుకెళ్లడంతో
కార్యక్రమంలో పోలీసులపైకి పలువురు వైసీపీ శ్రేణులు. దూసుకెళ్లారు. వైసీపీ కార్యకర్తల తోపులాటలో కిందపడ్డ నరసరావుపేట రూరల్ సిఐ రామకృష్ణకు స్వల్పగాయాలు కావడంతో సీరియస్ అయిన పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించారని నరసరావుపేట రూరల్ సిఐ రామకృష్ణ ఫిర్యాదు చేయడంతో వీరిపై నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.