నిఘా పెట్టింది మీరు కాదా?

డేటా చౌర్యంపై గతంలోనూ ఆరోపణలు చేశారని, అవి తర్వాత మాయమయి పోయాయని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు

Update: 2022-07-07 07:21 GMT

డేటా చౌర్యంపై గతంలోనూ కేసులు పెట్టారని, వాటిపై ఏం తేల్చలేకపోయారన్నారు పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. కేసులు పెట్టి అనవసరంగా ఉద్యోగులను వేధించారన్నారు. గతంలో పెగాసస్ పై కూడా విచారణ చేస్తామని చెప్పింది ఈ ప్రభుత్వమేనని అన్నారు. పెగాసస్ ను కొనుగోలు చేశామని చెప్పిన ఈ ప్రభుత్వం ఏం తేల్చలేకపోయిందన్నారు. అందులో ఏం తేల్చారని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. దీనిపై అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టంగా చెప్పారని అన్నారు. ప్రతిపక్ష నేతలపై సైబర్ నిఘ పెట్టింది మీరు కాదా? అని ప్రభుత్వాన్ని పయ్యావుల ప్రశ్నించారు.

నవ్వుల పాలు...
ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్ లు వాడుతున్నారో తెలుసుకోవాలన్నారు. అవి వాడాలంటేనే ఎమ్మెల్యేలు భయపడి పోతున్నారని పయ్యావుల కేశవ్ తెలిపారు. నిఘా పెట్టకూడదని, నిఘా పెడుతుంది ఈ ప్రభుత్వమేనని పయ్యావుల అన్నారు. కేంద్ర ప్రతి సారి విచారణ అనడం నవ్వుల పాలవ్వడం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని పయ్యావుల ఎద్దేవా చేశారు. ఎవరెవరిపై నిఘా పెట్టారన్న దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణకు సిద్ధమా? అని పయ్యావుల సవాల్ విసిరారు.


Tags:    

Similar News