Chandrababu : నేడు పీ4 పథకంపై చంద్రబాబు నాయుడు
నేడు ఆంధ్రప్రదేశ్ లో పీ4 పథకం ప్రారంభం కానుంది. పీ4 స్కీమ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ లో పీ4 పథకం ప్రారంభం కానుంది. పీ4 స్కీమ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 స్కీమ్ లో తొలిదశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మార్గదర్శిల ఎంపికపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
మార్గదర్శులతో...
పీ4 సంబంధిత మార్గదర్శిలతో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక భేటీలు నిర్వహించారు. ఈ పథకం కింద బంగారు కుటుంబాలను ఆదుకునే విషయంపై చంద్రబాబు నాయుడు మార్గదర్శిలకు దిశానిర్దేశం చేయనున్నాట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్థ తీసుకుని ఈ పథకాన్ని వీలయినంత త్వరగా గ్రౌండ్ చేయాలని చూస్తున్నారు.