Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద కొనసాగుతుంది. ఎగువన, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుంది.

Update: 2025-08-20 02:32 GMT

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద కొనసాగుతుంది. ఎగువన, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుంది. దీంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్ట్‌ డ్యామ్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తుున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4,09,376, ఔట్‌ఫ్లో 4,11,237 క్యూసెక్కులుగా ఉందని అధికారుుల తెలిపారు.

పది గేట్లు ఎత్తి...
శ్రీశైలం ప్రాజెక్ట్‌ ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. పది గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను పరిశీలించేందుకు పెద్దయెత్తున పర్యాటకులు తరలి వచ్చే అవకాశముండటంతో అక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News