విశాఖలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం!!

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.

Update: 2025-06-03 11:45 GMT

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. విశాఖలో నమోదైన కొవిడ్‌ కేసులకు సంబంధించిన నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీలో పరీక్షించగా ఒమిక్రాన్‌ వేరియంట్‌గా తేలింది. విశాఖ కేజీహెచ్‌ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అయితే ఆందోళన చెందనక్కర్లేదని, వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.


రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల తీరు, అందుబాటులో ఉన్న ప్రయోగశాలలు, కిట్లు, ఆక్సిజన్‌ ప్లాంట్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

Tags:    

Similar News