Chadrababu : నేడు గుంటూరు జిల్లాకు చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-06-26 04:50 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. నేడు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. అంతకు ముందు కొన్ని శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంనుంచి సచివాలయానికి చేరుకోనున్న చంద్రబాబు నాయుడు • మధ్యాహ్నం 12.15 గంటలకు స్పేస్ పాలసీపై సమీక్ష నిర్వహిస్తారు.

వివిధ కార్యక్రమాల్లో...
అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు గుంటూరుకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మిర్చి దాబా వరకు చేపట్టే అంతర్జాతీయ గంజాయి, మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీలో పాల్గొంటారు. 4.40 గంటలకు శ్రీ కన్వెన్షన్‌లో మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమంలో పాల్గొంటారు.సాయంత్రం ఆరు గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు


Tags:    

Similar News