Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు ఉదయం ఉండవల్లి నివాసం నుంచి 10.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటార.
వివిధ శాఖల సమీక్షలు...
ఉదయం పదకొండు గంటలకు ఏపీ ఫైబర్ నెట్‌పై సమీక్ష నిర్వహిస్తారు. ఏపీ ఫైబర్ నెట్ లో ప్రసారాల నాణ్యత, కనెక్షన్ల పెంపు వంటి వాటిపై అధికారులను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. మద్యం దుకాణాలు, గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం నాలుగు 0 గంటలకు స్వచ్ఛాంద్రపై చంద్రబాబు సమీక్ష చేస్తారు.