Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. 15 గంటలు దర్శనానికి నో

తిరుమలకు వెళ్లే భక్తులకు అధికారులు సమాచారం అందించారు. ఆలయం పన్నెండు గంటల పాటు మూసివేయానున్నారు

Update: 2025-09-05 11:53 GMT

తిరుమలకు వెళ్లే భక్తులకు అధికారులు సమాచారం అందించారు. ఆలయం పన్నెండు గంటల పాటు మూసివేయానున్నారు. ఈ నెల 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఏడో తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుండి 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని 12 గంటలపాటు మూసివేయనున్నారు.

పదిహేను గంటలకు దర్శానికి...
అయితే ఎనిమిది, తొమ్మిది తేదీల్లో సిపార్సు లేఖలను కూడా రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఏడో తేదీన ఆలయం మూసివేసినా తర్వాత ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. దాదాపు పదిహేను గంటల పాటు తిరుమల శ్రీవారి దర్శనాలను రద్దు చేయనున్నారు. అయితే ఆర్జిత సేవలతో పాటు భాద్రపద గరుడ వాహన సేవను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు.


Tags:    

Similar News