థియేటర్లలో తనిఖీలు.. దిగివచ్చిన యాజమాన్యాలు

ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి.

Update: 2025-05-30 13:14 GMT

ఆంధ్రప్రదేశ్ లో సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు సత్ఫలితాలనిస్తున్నాయి. థియేటర్ల యాజమాన్యం దిగి వచ్చినట్లే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో రెవెన్యూ, పోలీసు, తూనికల కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఆహార పదార్థాలు ఎక్కువ ధరకు విక్రయించడంపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపనున్నారు.

తగ్గించిన ధరలు...
అయితే తనిఖీల అనంతరం థియేటర్ల యాజమాన్యం మాత్రం కొంత మేరకు దిగి వచ్చింది. ఆహార పదార్థాల ధరలపై పది నుంచి ఇరవై శాతం వరకూ ధరలు తగ్గించి విక్రయించడానికి థియేటర్ల యజమానులు సిద్ధమయ్యారు. ఆహార పదార్థాలు ధరలు తగ్గిస్తే కొంత వరకూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశముందని డిస్ట్రిబ్యూటర్లతో పాటు నిర్మాతలు కూడా అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News