Tirumala : శనివారం.. రద్దీ తగ్గడానికి రీజన్ ఇదే

తిరుమలలో నేడు భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. శనివారం అయినా పెద్దగా భక్తుల దర్శనం లేదు

Update: 2023-11-25 03:15 GMT

Tirumala

తిరుమలలో నేడు భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. శనివారం అయినా పెద్దగా భక్తుల దర్శనం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు కార్తీక మాసం కూడా కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అలాగే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తుండటం కూడా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడానికి కారణమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వీకెండ్ లో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంటుంది.ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం సులభంగా లభిస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 9 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

రెండు గంటల్లో...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటల సమయం దర్శనం లభిస్తుంది. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటలలో దర్శనం దొరుకుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,843 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,776 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News