దుర్గగుడిలో నేడు వీఐపీ దర్శనాలకు బ్రేక్
విజయవాడ దుర్గ గుడిలో ఈరోజు భక్తుల సంఖ్య పెరిగింది. ఆషాఢమాసం సారె ను అమ్మవారికి సమర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు
విజయవాడ దుర్గ గుడిలో ఈరోజు భక్తుల సంఖ్య పెరిగింది. ఆషాఢమాసం సారె ను అమ్మవారికి సమర్పించేందుకు భారీగా భక్తులు తరలి వస్తారని తెలిసి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ అన్ని దర్శన టిక్కెట్లను రద్దు చేసినట్లు తెలిపారు. వీఐపీ భక్తులు కూడా తమకు సహకరించాలని ఆలయ ఈవో శీనూ నాయక్ కోరారు. భక్తులందరికీ సకాలంలో దర్శన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులు సహకరించి సంయమనంతో వ్యవహరించాలని కోరారు.
ఆషాఢ మాసం సారెను...
వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ దుర్గ గుడికి వచ్చే భక్తులందరికి ఆదివారం సకాలంలో దర్శనం ఏర్పాట్లు అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఆషాడ మాస సారె సమర్పణ నేపథ్యంలో గత రెండు వారాలుగా ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని టిక్కెట్లు రద్దు చేశామన్నారు. వ ఈ సమయాలలో ఎటువంటి ప్రోటోకాల్ ఉండదని, భక్తులందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు.